ECIL Hyderabad Recruitment: హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దేశవ్యాప్తంగా ఈసీఐఎల్ ప్రాజెక్టు పనుల్లో వివిధ ఖాళీల భర్తీకి వేర్వేరుగా నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటి ద్వారా మొత్తం 81 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ, టెక్నీషియన్, ట్రైనీ ఆఫీసర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో డిగ్రీ లేదా పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 23న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఏప్రిల్ 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పోస్టుల ఆధారంగా రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ట్రేడ్ టెస్ట్, సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
ఖాళీల వివరాలు...
మొత్తం ఖాళీల సంఖ్య: 81.
Continues below advertisement
➥ గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ (GET): 30 పోస్టులు
పోస్టుల కేటాయింపు: జనరల్ (యూఆర్)-15, ఈడబ్ల్యూఎస్-02, ఓబీసీ-08, ఎస్టీ-01, ఎస్సీ-04.
విభాగాలవారీగా ఖాళీలు: ఈసీఈ-05, ఈఈఈ-07, మెకానికల్-13, సీఎస్‌ఈ-05.
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్/ఇంజినీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 13.04.2024 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాలు వయోసడలింపు వర్తిస్తుంది.
పే స్కేల్: నెలకు రూ.40,000 - 1,40,000.
➥ ట్రెయినీ ఆఫీసర్ (ఫైనాన్స్): 07 పోస్టులు
పోస్టుల కేటాయింపు: జనరల్ (యూఆర్)-03, ఈడబ్ల్యూఎస్-01, ఓబీసీ-02, ఎస్టీ-01.
అర్హత: చార్టర్డ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అకౌంటెంట్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 13.04.2024 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాలు వయోసడలింపు వర్తిస్తుంది.
పే స్కేల్: నెలకు రూ.40,000 - 1,40,000.
➥ డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్): 14 పోస్టులు
పోస్టుల కేటాయింపు: జనరల్ (యూఆర్)-07, ఈడబ్ల్యూఎస్-02, ఓబీసీ-03, ఎస్టీ-01, ఎస్సీ-01.
విభాగాలవారీగా ఖాళీలు: ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో హార్డ్‌వేర్-02, సాఫ్ట్‌వేర్-03; పవర్ ఎలక్ట్రానిక్స్-02, మెకానికల్ డిజైన్-02, రేడియో ఫ్రీక్వెన్సీ సిస్టమ్స్-04, సైబర్ సెక్యూరిటీ-01,
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ/ ఇంజినీరింగ్ పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి: 13.04.2024 నాటికి 32 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాలు వయోసడలింపు వర్తిస్తుంది.
పే స్కేల్:నెలకు రూ.50,000 - 1,60,000.
➥ టెక్నీషియన్ (గ్రేడ్-2): 30 పోస్టులు
పోస్టుల కేటాయింపు: జనరల్ (యూఆర్)-16, ఈడబ్ల్యూఎస్-03, ఓబీసీ-09, ఎస్టీ-01, ఎస్సీ-01.
విభాగాలవారీగా ఖాళీలు: ఎలక్ట్రానిక్స్ మెకానిక్-07, ఎలక్ట్రీషియన్-06; మెషినిస్ట్-07, ఫిట్టర్-10.
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ/ ఇంజినీరింగ్ పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి: 13.04.2024 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాలు వయోసడలింపు వర్తిస్తుంది.
పే స్కేల్: నెలకు రూ.20,480.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం..
➙ గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ, ట్రెయినీ ఆఫీసర్ పోస్టులకు రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
➙ డిప్యూటీ మేనేజర్ పోస్టులకు కేవలం ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహిస్తారు.
➙ టెక్నీషియన్ పోస్టులకు ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ ఉండదు.
దరఖాస్తు ఫీజు: యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. టెక్నీషియన్ పోస్టులకు రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు: బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబయి/నాగ్‌పూర్, న్యూఢిల్లీ/నోయిడా, కోల్‌కతా.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.03.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 13.04.2024. (14:00 Hours)
0 comments:
Post a Comment