APPSC ADTP Recruitment 2024 : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీసులో అసిస్టెంట్ డైరెక్టర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 7 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 21వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఏప్రిల్ 10వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అప్లయ్ చేసుకోవడానికి, పూర్తి వివరాలకు https://psc.ap.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
ఇతర సమాచారం
అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు: 7
అర్హత: బీఆర్క్ లేదా బీఈ (సివిల్) లేదా బీప్లానింగ్/ బీటెక్ (ప్లానింగ్) లేదా ఎంఏ (జాగ్రఫీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా టౌన్ ప్లానింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01/07/2024 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.61,960 - 1,51,370గా ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు : రూ.370. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.250గా నిర్ణయించారు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ : మార్చి 21, 2024
దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 10, 2024
0 comments:
Post a Comment