ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC).. ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీసులో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 18వ తేదీ నుంచి మే 8వ తేదీ లోగా ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://psc.ap.gov.in/ వెబ్సైట్ చూడొచ్చు.
ఇతర సమాచారం:
అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు : 5
అర్హత: బీఎస్సీలో స్టాటిస్టిక్స్/ మ్యాథమెటిక్స్/ ఎకనామిక్స్/ కామర్స్/ కంప్యూటర్ సైన్స్‌తో బ్యాచిలర్ డిగ్రీ (స్టాటిస్టిక్స్ పేపర్ ఒక సబ్జెక్టుగా) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01/07/2024 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.45,830 – 1,30,580గా నిర్ణయించారు.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.370. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.250గా నిర్ణయించారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం తేదీ: ఏప్రిల్ 18, 2024
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: మే 8, 2024
0 comments:
Post a Comment