ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్... ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీసులో అసిస్టెంట్ డైరెక్టర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
ప్రకటన వివరాలు:
* అసిస్టెంట్ డైరెక్టర్: 07 పోస్టులు
అర్హత: బీఆర్క్ లేదా బీఈ (సివిల్) లేదా బీప్లానింగ్/ బీటెక్ (ప్లానింగ్) లేదా ఎంఏ (జాగ్రఫీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా టౌన్ ప్లానింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01/07/2024 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: 61,960 - 1,51,370.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగాఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.370. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.250.
పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లింకు క్రింది కలవు
Download Complete Notification
0 comments:
Post a Comment