APPSC FRO Notification: ఏపీలో 35 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ పోస్టులు, ఎంపికైతే రూ.1.37 లక్షల వరకు జీతం

APPSC FRO Recruitment: ఆంధ్రప్రదేశ్ అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ (Forest Range Officers) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఏప్రిల్ 15 నుంచి మే 5 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. అభ్యర్థులు అప్టికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు ఉంటుంది

వివరాలు..

* ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్

ఖాళీల సంఖ్య: 37 పోస్టులు

విభాగం: ఏపీ ఫారెస్ట్ సర్వీస్.

పోస్టుల కేటాయింపు: ఓసీ-14, బీసీ-12, ఈడబ్ల్యూఎస్-11.

జోన్లవారీగా ఖాళీలు: జోన్ 1-08, జోన్ 2-11, జోన్ 3-10, జోన్ 4-08. 

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (అగ్రికల్చర్/కెమిస్ట్రీ/కంప్యూటర్ అప్లికేషన్స్/కంప్యూటర్ సైన్స్/ ఇంజినీరింగ్/ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/ ఫారెస్ట్రీ/ జియోలజీ/ హార్టికల్చర్/ మ్యాథమెటిక్స్/ ఫిజిక్స్/ స్టాటిస్టిక్స్/ వెటర్నరీ సైన్స్/ జువాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 01.07.2024 నాటికి 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్/ఎన్‌సీసీ అభ్యర్థులకు వయసు ఆధారంగా 3 సంవత్సరాలు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, తాత్కాలిక ఉద్యోగులకు 3 సంవత్సరాల వరకు వరకు వయోసడలింపు వర్తిస్తుంది.  

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 కలిపి మొత్తం రూ.370 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థుల, తెల్లరేషన్ కార్డు ఉన్న అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ రాతపరీక్షలు, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా. 

ప్రిలిమినరీ పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు ప్రిలిమనరీ రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం రెండు విభాగాలుంటాయి. ఇందులో పార్ట్-ఎ జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ, పార్ట్-బి (జనరల్ ఫారెస్ట్రీ) ఉంటాయి. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పుసమాధానానికి 1/3 వంతు మార్కులు కోత విధిస్తారు.

మెయిన్ పరీక్ష విధానం: మొత్తం 600 మార్కులకు ప్రిలిమనరీ రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. ఒకటి క్వాలిఫైయింగ్ పేపర్ (జనరల్ ఇంగ్లిష్, జనరల్ తెలుగు) ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పుసమాధానానికి 1/3 వంతు మార్కులు కోత విధిస్తారు.

కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్: మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఆఫీస్ ఆటోమేషన్, కంప్యూటర్ వినియోగం, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. కనీసం అర్హత మార్కులను ఓసీలకు 40గా, బీసీలకు 35గా, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 30 మార్కులుగా నిర్ణయించారు.

జీత భత్యాలు: నెలకు రూ.48,440- రూ.1,37,220 ఇస్తారు. 

పరీక్ష కేంద్రాలు: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, క్రిష్ణా, గుంటుూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.04.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 05.05.2024. (11:59)

➥ రాతపరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top