Indian Coast Guard Navik Recruitment: ఇండియన్ కోస్ట్‌గార్డులో నావిక్ పోస్టుల (జనరల్ డ్యూటీ) భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం260 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఇంటర్ అర్హత ఉన్న అవివాహిత పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నిర్ణీత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అభ్యర్థులు ఫిబ్రవరి 13 నుంచి 27 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్టుల ఆధారాంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు
వివరాలు..
* నావిక్ పోస్టులు (జనరల్ డ్యూటీ) - 02/2024 బ్యాచ్
ఖాళీల సంఖ్య: 260 పోస్టులు
పోస్టుల కేటాయింపు: జనరల్-102, ఈడబ్ల్యూఎస్-26, ఓబీసీ-57, ఎస్టీ-28, ఎస్సీ-47.
రీజియన్లవారీగా ఖాళీల వివరాలు..
➥ నార్త్ రీజియన్: 79 పోస్టులు
పోస్టుల కేటాయింపు: జనరల్-31, ఈడబ్ల్యూఎస్-08, ఓబీసీ-17, ఎస్టీ-08, ఎస్సీ-14.
➥ వెస్ట్ రీజియన్: 66 పోస్టులు
పోస్టుల కేటాయింపు: జనరల్-26, ఈడబ్ల్యూఎస్-07, ఓబీసీ-14, ఎస్టీ-07, ఎస్సీ-12.
➥ నార్త్-ఈస్ట్ రీజియన్: 68 పోస్టులు
పోస్టుల కేటాయింపు: జనరల్-27, ఈడబ్ల్యూఎస్-07, ఓబీసీ-15, ఎస్టీ-07, ఎస్సీ-12.
➥ ఈస్ట్ రీజియన్: 33 పోస్టులు
పోస్టుల కేటాయింపు: జనరల్-13, ఈడబ్ల్యూఎస్-03, ఓబీసీ-07, ఎస్టీ-04, ఎస్సీ-06.
➥ నార్త్-వెస్ట్ రీజియన్: 12 పోస్టులు
పోస్టుల కేటాయింపు: జనరల్-05, ఈడబ్ల్యూఎస్-01, ఓబీసీ-03, ఎస్టీ-01, ఎస్సీ-02.
➥ అండమాన్ & నికోబార్ రీజియన్: 03 పోస్టులు
పోస్టుల కేటాయింపు: జనరల్-102, ఈడబ్ల్యూఎస్-26, ఓబీసీ-01, ఎస్టీ-01, ఎస్సీ-01.
అర్హత: ఇంటర్ (మ్యాథ్స్, ఫిజిక్స్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థుల వయసు 18 - 22 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 01.09.2002 నుంచి 31.08.2006 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు ఉంది.
పరీక్ష ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: స్టేజ్-1: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, స్టేజ్-2: అసెస్‌మెంట్/అడాప్టబిలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష, స్టేజ్-3: డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ ఎన్‌రోల్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా.
పరీక్ష విధానం...
➦ మొత్తం 60 మార్కులకు స్టేజ్-1 రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 60 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఇంగ్లిష్-15 ప్రశ్నలు, సైన్స్-10 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్-20 ప్రశ్నలు, రీజనింగ్-10 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్-05 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 45 నిమిషాలు. పరీక్షలో అర్హత మార్కులను జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు 30 మార్కులుగా, ఎస్సీ-ఎస్టీలకు 27 మార్కులుగా నిర్ణయించారు. పదోతరగతి స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి.
➦ మొత్తం 50 మార్కులకు స్టేజ్-2 రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 50 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో మ్యాథమెటిక్స్-25 ప్రశ్నలు, ఫిజిక్స్-25 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 30 నిమిషాలు. పరీక్షలో అర్హత మార్కులను జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు 20 మార్కులుగా, ఎస్సీ-ఎస్టీలకు 17 మార్కులుగా నిర్ణయించారు. ఇంటర్ స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి.
➦ రాతపరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు.
పేస్కేలు: ఎంపికైనవారికి ఆరంభంలో నెలకు రూ.21,700 (పే లెవల్ 3)తో పాటు ఇతర భత్యాలు ఉంటాయి. ప్రమోషన్ తర్వాత ప్రధాన అధికారి హోదాలో డీఏతో పాటు రూ.47,600 (పే లెవల్ 8) ఇస్తారు. రూ.75 లక్షల వరకు ఇన్స్యూరెన్స్ కవరేజీ కూడా ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.02.2024 (11:00).
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 27.02.2024 (17:30)
➥ స్టేజ్-1 పరీక్షలు: ఏప్రిల్ 2024.
➥ స్టేజ్-2 పరీక్షలు: మే 2024.
➥ స్టేజ్-3 ప్రక్రియ: అక్టోబరు 2024.
0 comments:
Post a Comment