ఇస్రోలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. తమిళనాడులోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ (IPRC).. అప్రెంటిస్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కింద మొత్తం 100 పోస్టులను భర్తీ చేస్తారు. దీని కింద మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్ తదితర వాటిల్లో 100 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇస్రో అధికారిక వెబ్‌సైట్ isro.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల్లో ఎంపిక కోసం ఎలాంటి రాత పరీక్ష ఉండదు. ఆసక్తి,అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 10, 11 తేదీలలో షెడ్యూల్ చేయబడిన వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
పోస్టుల వివరాలు
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల సంఖ్య - 41 పోస్టులు
టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల సంఖ్య - 44 పోస్టులు
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (నాన్ ఇంజినీరింగ్) కోసం పోస్టుల సంఖ్య - 15 పోస్ట్‌లు
గుర్తుంచుకోవలసిన తేదీలు
వాక్-ఇన్-ఇంటర్వ్యూ యొక్క పూర్తి షెడ్యూల్ ఇస్రో IPRC రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో ఇవ్వబడింది. పోస్ట్ వారీ షెడ్యూల్ ప్రకారం మీరు వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజనీరింగ్)-10 ఫిబ్రవరి, 2024
టెక్నీషియన్ అప్రెంటిస్- 10 ఫిబ్రవరి, 2024
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (నాన్ ఇంజనీరింగ్) - 11 ఫిబ్రవరి, 2024
అర్హత
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్: అభ్యర్థులు సంబంధిత ఇంజనీరింగ్/టెక్నాలజీలో ఫస్ట్ క్లాస్ డిగ్రీని కలిగి ఉండాలి. ఇది కాకుండా, అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో దీనికి సంబంధించిన అన్ని వివరాలను చూడవచ్చు.
ఎంపికైతే స్టైఫండ్
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ - రూ 9,000
టెక్నీషియన్ అప్రెంటీస్ - రూ. 8,000
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ (నాన్ ఇంజినీరింగ్) - రూ 9,000
దరఖాస్తు చేయడానికి లింక్,నోటిఫికేషన్‌ను ఇక్కడ చూడండి
Whatsapp Channel...
Telegram Channel...
0 comments:
Post a Comment