AAI : ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 490 జాబ్స్‌..

AAI: ఎయిర్పోర్ట్స్ అథారిటీలో 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

న్యూదిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ- ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా- దేశ వ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మే 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలు:

1. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్): 03 పోస్టులు

2. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్- సివిల్): 90 పోస్టులు

3. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్- ఎలక్ట్రికల్): 106 పోస్టులు

4. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్): 278 పోస్టులు

5. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 13 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ గేట్ 2024 స్కోరు ఉండాలి.

వయోపరిమితి: 01/05/2024 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీత భత్యాలు: నెలకు రూ.40,000-1,40,000.

దరఖాస్తు రుసుము: రూ.300(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది).

ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు ప్రారంభ తేదీ: 02/04/2024.

ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 01/05/2024

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top