జపాన్ లో నర్సుల ఉద్యోగాలకు టామ్కామ్ జాబ్మేళా నిర్వహిస్తోంది. ఈ సంస్థ ఇప్పటికే రెండు బ్యాచ్లో అక్కడి ప్రఖ్యాత ఆస్పత్రుల్లో నర్సు ఉద్యోగాలు కల్పించింది. తాజాగా మూడో బ్యాచ్ కార్యక్రమం జనవరి 29న జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ (NSTI) విద్యానగర్, హైదరాబాద్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎంపిక జరుగుతుందని టామ్కామ్ (TOMCOM) సీఈవో తెలిపారు. బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం డిప్లొమా అర్హత కలిగి 22-30 ఏళ్ల వయసున్న వారు దరఖాస్తుకు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.1.5 లక్ష నుంచి రూ.1.8 లక్షల వేతనం లభిస్తుందని, 28 29 8919047600, 6302292450, 9573945684 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment