వివిధ ఫార్మా కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 23న స్థానిక ఎంఆర్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తామని జిల్లా ఉపాధి కల్పనాధికారి డి.అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. గ్లాండ్ ఫార్మా లిమిటెడ్‌లో ప్రొడక్షన్ ప్యాకింగ్, ఏపీఐసీ ప్రొడక్షన్ విభాగాల్లో, మెడ్‌ప్లస్‌లో ఫార్మాసిస్ట్, ఫార్మసీ, సీఎస్‌ఏ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ జరుగుతుందని తెలిపారు.
ఆయా పోస్టులను బట్టి ఐటీఐ, డిప్లమో, డిగ్రీ ఫార్మసీ, ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికై న వారు హైదరాబాద్, వైజాగ్, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ పేర్లను ముందుగా ‘ఎన్‌సీఎస్.జీఓవీ.ఐఎన్’ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని ఈ నెల 23న ఉదయం 10 గంటలకు ఉవిజయనగరం ఎంఆర్ కళాశాలలో జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు. పూర్తి వివరాల కోసం ఫోన్ 8919378915 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
0 comments:
Post a Comment