CRPF: సీఆర్పీఎఫ్ లో 169 కానిస్టేబుల్ పోస్టులు

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)... స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్ 'సి' విభాగంలో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) నాన్-గెజిటెడ్ అండ్ నాన్ మినిస్టీరియల్ ఖాళీల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులు భారతదేశం, విదేశాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

వివరాలు:

* కానిస్టేబుల్: 169 పోస్టులు

క్రీడా విభాగాలు: జిమ్నాస్టిక్, జూడో, వుషు, షూటింగ్, బాక్సింగ్, అథ్లెటిక్స్, ఆర్చరీ, రెజ్లింగ్ ఫ్రీ స్టైల్, గ్రీకో రోమన్, తైక్వాండో, వాటర్ స్పోర్ట్స్ కయాక్, కానో, రోయింగ్, బాడీబిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, ట్రయత్లాన్, డైవింగ్, డైవింగ్ ఈక్వెస్ట్రియన్, యాచింగ్, ఐస్ హాకీ, ఐస్ స్కేటింగ్, ఐస్ స్కీయింగ్.

జీత భత్యాలు: రూ.21,700-రూ.69,100.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత, నిర్దిష్ట శారీరక దార్థ్యంతోపాటు సంబంధిత క్రీడాంశాల్లో అర్హత సాధించి ఉండాలి.

వయోపరిమితి: 15/02/2024 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: క్రీడా ప్రదర్శన, స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.100(ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-02-2024.

Official Website


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top