AP TET: ఏపీలో టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లు వచ్చేస్తున్నాయ్! మొత్తం 6 వేల టీచర్ పోస్టుల భర్తీకి కసరత్తు

AP DSC Notification 2024: ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET), డీఎస్సీని వేర్వేరుగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టెట్‌కు ఫిబ్రవరి 1 నుంచి దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది. అభ్యర్థుల నుంచి వచ్చే దరఖాస్తుల ఆధారంగా టెట్ పరీక్షల షెడ్యూలును అధికారులు ఖరారుచేయనున్నారు. ఒకవేళ దరఖాస్తులు భారీగా వస్తే.. పరీక్షల నిర్వహణకే 15 రోజులు పట్టే అవకాశం ఉంది. అయితే టెట్‌తో పాటే 10-15 రోజులు అటు ఇటుగా డీఎస్సీకి దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు డీఎస్సీలో 6 వేల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది.

జనవరి 31న ఆమోదం..

ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, టెట్, డీఎస్సీకి జనవరి 31న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. అనంతరం షెడ్యూలును ప్రకటిస్తారు. మొదట టెట్ నిర్వహించి, ఫలితాలు ఇచ్చిన తర్వాత డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. టెట్, డీఎస్సీలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు.

ఎస్జీటీ పోస్టులు డీఈడీ అభ్యర్థులకే..

సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) పోస్టులకు పేపర్-1, స్కూల్ అసిస్టెంట్(SA) పోస్టులకు పేపర్-2 విడివిడిగా టెట్ నిర్వహిస్తారు. ఎస్జీటీ పోస్టులకు డీఈడీ లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదివిన వారు మాత్రమే అర్హులు. టెట్ రాసేందుకు ఓసీలకు ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉండాలి. స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులైన అభ్యర్థులకు డిగ్రీలో అర్హత మార్కులు 40 శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీన్ని ఈ ఒక్కసారికే అనుమతించింది. గత ప్రభుత్వంలో 2018లో చివరిసారిగా డీఎస్సీ నిర్వహించారు. అప్పుడు మొత్తం 7,902 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. మొత్తం 6.08 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 

గతంలో పరీక్షలు ఇలా..

గతంలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ చేసిన వారికి అర్హత కల్పించినందున ఈ పోస్టులకు డీఎస్సీ, టెట్ కలిపి 100 మార్కులకు నిర్వహించారు. టీజీటీ వారికి ఆంగ్ల భాషలో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. ఈసారి టెట్, డీఎస్సీ విడివిడిగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. టెట్, డీఎస్సీ రెండింటికి దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యేనాటికి ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top