AP Cabinet Decisions: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకోంది.. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన కొనసాగుతోన్న మంత్రి మండలి సమావేశంలో పలు కీలక అంశాలకు పచ్చజెండా ఊపారు..
కేబినెట్‌లో డీఎస్సీ నిర్వహణ, నోటిఫికేషన్ జారీపై చర్చించారు.. సుమారు 6 వేల టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఆమోద ముద్ర వేసింది ఏపీ కేబినెట్.. మరోవైపు.. వైఎస్సార్ చేయూత నాలుగో విడతకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఫిబ్రవరి నెలలో వైఎస్సార్ చేయూత నిధులు విడుదలకు ఆమోదం తెలిపింది.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 5 వేల కోట్ల మేర నిధుల విడుదలకు ఆమోద ముద్ర వేసింది.. ఇక, ఎస్ఐపీబీ ఆమోదించిన తీర్మానాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ మంత్రిమండలి..
వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన మరియు ప్రైవేటు సంస్థలకు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ కావలసినవారు ఈ వాట్సప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి....
Whatsapp Channel...
Telegram Channel...
0 comments:
Post a Comment