స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) జూనియర్ అసోసియేట్(క్లర్క్) ప్రాథమిక పరీక్ష (ప్రిలిమ్స్) పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. దేశ వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో జనవరి 5, 6, 11, 12 తేదీల్లో ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్లు ఎస్ బీఐ తెలిపింది. డిసెంబర్ 27న అడ్మిట్ కార్డుల విడుదల కానున్నాయి. ఫిబ్రవరిలో మెయిన్స్ జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా 8,773 జూనియర్ అసోసియేట్స్(క్లరికల్ కేడర్) పోస్టులను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్లో 525; అమరావతి సర్కిల్లో 50 ఖాళీలున్నాయి. ఆన్లైన్ టెస్ట్(ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), స్థానిక భాష పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment