ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. 1603 పోస్టులకు రిక్రూట్‌మెంట్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ట్రైనింగ్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక పోర్టల్ iocl.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ డిసెంబర్ 16న ప్రారంభమై జనవరి 5న ముగుస్తుంది.
* ఖాళీల వివరాలు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రధానంగా ట్రేడ్, టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ విభాగాల్లో అప్రెంటిస్‌లను నియమించనుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మొత్తంగా 1603 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తుంది.

రాష్ట్రాల వారీగా ఖాళీలు

రాష్ట్రాల వారీగా చూస్తే.. ఢిల్లీలో 138 పోస్టులు, హర్యానా-82, చండీగఢ్- 14, జమ్మూ కాశ్మీర్-17, పంజాబ్-76, హిమాచల్ ప్రదేశ్-19, రాజస్థాన్-96, ఉత్తర ప్రదేశ్-256, బీహార్-63, ఉత్తరాఖండ్-24, పశ్చిమ బెంగాల్-189, ఒడిషా-45, జార్ఖండ్-28, అస్సాం-96, సిక్కిం-3, త్రిపుర నుంచి 4, నాగాలాండ్ నుంచి 2 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఐఓసీ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే 2023 నంబర్ 30 నాటికి అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. పోస్టుల ఆధారంగా విద్యార్హతలు వేర్వేరుగా ఉంటాయి. పదోతరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, ఐటీఐ పూర్తిచేసి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక ప్రక్రియ

ఆన్‌లైన్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఎగ్జామ్ ప్రశ్నాపత్రం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ రూపంలో ఉంటుంది. ఒక ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. తప్పు సమాధానానికి నెగిటివ్ మార్క్ విధానం లేదు. పరీక్ష షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తారు.

* అప్లికేషన్ ప్రాసెస్

- ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారిక పోర్టల్ iocl.com ఓపెన్ చేయాలి.

- హోమ్‌పేజీలోకి వెళ్లి, 'అప్రెంటిస్ రిజిస్ట్రేషన్- 2023' లింక్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించాలి.

తరువాత 'అప్లైనౌ' ఆప్షన్‌పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి.

- రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి. అన్ని వివరాలతో అప్లికేషన్ నింపాలి.

- అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి, ఫారమ్ సబ్‌మిట్ చేయాలి.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తుదారులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు.

* అవసరమైన డాక్యుమెంట్స్

దరఖాస్తు సమయంలో అభ్యర్థులు కొన్ని కీలక డాక్యమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ సర్టిఫికేట్స్ తప్పనిసరిగా ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్(వర్తిస్తే), క్యాన్సిల్డ్ చెక్, పాన్‌కార్డ్, బ్లాక్ పెన్‌తో అభ్యర్థి సంతకం స్కాన్ కాపీ, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో ఉండాలి. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ చెక్ చేయవచ్చు.
Online Application

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top