నంద్యాల జిల్లా లో కల 6 ఐసిడియస్ ప్రాజెక్ట్ ల పరిధిలోని 1 మినీ కార్యకర్త మరియు 25 అంగన్వాడీ ఆయాలు నియామకమున కై అర్హులైన స్త్రీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. అంగన్వాడీ ఆయా మరియు మినీ అంగన్వాడి కార్యకర్త పోస్టునకు తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండవలను. ఒక వేళ 10 వ తరగతి వాళ్ళు లేనిచో ఎక్కువ చదువు చదివి ఉత్తీర్ణులై ఉండవలయును. వయస్సు 1.7.2023 నాటికి 21 సం. నిండి 35 సం.లోపు ఉండవలెను. పెళ్లి అయి అదే గ్రామములో నివసించువారై ఉండవలెను. నియామకముల లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించబడుతుంది. మరిన్ని విషయాలకు, ఖాళీల వివరాలకు మరియు పూర్తి నోటిఫికేషన్ కొరకు సంభందిత సి. డి. పి. ఒ కార్యాలయములో సంప్రదించవలెను మరియు వారి కార్యాలయము నోటిస్ బోర్డు నందు చూసుకోగలరు మరియు ఇతర వివరాల కొరకు http://nandyal.ap.gov.in/ ను పరిశీలించ గలరు. దరఖాస్తు వెంట ధృవ పత్రములు జిరాక్స్ కాపీలను (సెల్ఫ్ అబ్జెస్టేషన్ చేయవలెను) జత పరచి సంబంధిత సి. డి. పి. ఒ కార్యాలయమునకు పని దినములలో తేది: 02.11.2023 ఉదయం 11 గం. ల నుండి మొదలు 10.11.2023 సాయంత్రము 5.00 గంటల లోపల సమర్పించవలెను.
ఈ నోటిఫికేషన్ ను ఏ సమయములో అయిన రద్దు చేయు అధికారం ఈ క్రింద సంతకము దారులకు కలదు.
నంద్యాల జిల్లా పరిధి లో 6 ఐసిడియస్ ప్రాజెక్ట్ ల లో ఖాళీగా ఉన్న మొత్తం 25 అంగన్వాడీ ఆయాలు నియామకమున కై పరిమిత నోటిఫికేషన్ జారీ చేస్తూ అర్హులైన స్త్రీ అభ్యర్ధుల నుండి దరఖాస్తులు బడుచున్నవి.
మినీ అంగన్వాడీ కార్యకర్త అంగన్వాడీ ఆయా పోస్టునకు కావాల్సిన అర్హతలు:-
1. అభ్యర్థి తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండవలను. ఒక వేళ 10 వ తరగతి వాళ్ళు లేనిచో ఎక్కువ చదువు చదివి ఉత్తీర్ణులై ఉండవలయును.
2. అభ్యర్థినులు తేదీ 01.07.2023 నాటికి 21 వ సం.ల వయస్సు నిండి 35 సం. ల వయస్సు లోపు వారై ఉండవలెను
3. అభ్యర్థినులు తప్పనిసరిగా వివాహితురాలై ఉండవలెను మరియు స్థానిక నివాసితురాలై ఉండవలెను 4. యస్. సి. యస్ టి జనావాస ప్రాంతాలలో అభ్యర్థినిల లో 21 సం. వయసు నిండిన వారు లేనిచో దిగువ వయస్సు 18 సం. నిండిన వారిని పరిగణలోనికి తీసుకొనబడను
జతపరచవలసిన ధృవ పత్రములు:-
1. పుట్టిన తేదీ/ వయస్సు దృవీకరణ పత్రము
2. కుల దృవీకరణ పత్రము
3. విద్యార్హత దృవీకరణ పత్రము - యస్.యస్.సి. మార్క్ లిస్ట్, టి.సి, మరియు యస్. యస్. సి. లోపు ఎక్కువ తరగతి చదివిన మార్క్ లిస్ట్ మరియు టి. సి. జతపర్చవలెను
4. నివాస స్థల దృవీకరణ పత్రము.
5. వితంతువు అయినచో నచో భర్త మరణ దృవీకరణ పత్రము
6. వికలాంగులు అయినచో పి. హెఎచ్ సర్టిఫికేట్
7. వితంతువు అయినచో 18 సం. ల పిల్లలు ఉన్నచో, పిల్లల వయసు ధృవీకరణ పత్రము
8. ఆడారు కార్డ్ మరియు (9) రేషన్ కార్డు
దరఖాస్తు వెంట ధృవ పత్రములు జిరాక్స్ కాపీలను (సెల్ఫ్ అబ్జెస్టేషన్ చేయవలెను) జత పరచి సంబంధిత సి. డి. పి. ఓ కార్యాలయమునకు తేది: 02.11.2023 నుండి 10.11. 2023 సాయంత్రము 5.00 గంటల లోపల కార్యాలయముల పని దినములలో సమర్పించవలెను.
ఈ నోటిఫికేషన్ ను ఏ సమయములో అయిన రద్దు చేయు అధికారం ఈ క్రింద సంతకము దారులకు కలదు.
0 comments:
Post a Comment