DWCWEO, Guntur Notification: గుంటూరులోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన జిల్లాలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా జిల్లా కోఆర్డినేటర్, బ్లాక్ కోఆర్డినేటర్ ఉద్యోగాలు, జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా అర్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో నవంబరు 27లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అర్హతలు, అనుభవం, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికలు చేపడతారు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 08 పోస్టులు
సీట్ల కేటాయింపు: ఓసీ-06 ఎస్సీ-01, బీసీ(ఎ)-01.
➥ జిల్లా కోఆర్డినేటర్ (డీపీఎంయూ): 01 పోస్టు
అర్హతలు: డిగ్రీ/డిప్లొమా (కంప్యూటర్ సైన్స్/ ఐటీ).
అనుభవం: అప్లికేషన్ మెయింటెనెన్స్, సపోర్ట్ విభాగాల్లో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
రెన్యూమరేషన్: రూ.30,000.
➥ జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్: 01 పోస్టు
అర్హతలు: డిగ్రీ/పీజీ డిప్లొమా (మేనేజ్‌మెంట్/సోషల్ సైన్సెస్/న్యూట్రీషన్).
అనుభవం: కెపాసిటీ బిల్డింగ్, సూపర్‌వైజరీ విభాగాల్లో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
రెన్యూమరేషన్: రూ.18,000.
➥ బ్లాక్ కోఆర్డినేటర్: 06 పోస్టులు
అర్హతలు: ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి.
అనుభవం: టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ విభాగాల్లో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, స్థానిక బాషపై పట్టు ఉండాలి. స్థానిక అభ్యర్థి అయి ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
రెన్యూమరేషన్: రూ.20,000.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో.
ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికలు చేపడతారు.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
District Women & Child Welfare Empowerment Officer (DWCWEO)
Guntur District.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 27.11.2023
0 comments:
Post a Comment