DWCWE Palnadu Recruitment: నరసరావుపేటలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, ఒప్పంద ప్రాతిపదికన పల్నాడు జిల్లాలో ప్రాజెక్ట్ అసిస్టెంటట్, బ్లాక్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో నవంబరు 28లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల నుంచి ఎంపిక చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించిన తుది ఎంపిక చేపడతారు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 10 పోస్టులు
➥ ప్రాజెక్ట్ అసిస్టెంట్: 01 పోస్టు
అర్హత: డిగ్రీ/పీజీ డిప్లొమా (మేనేజ్‌మెంట్/సోషల్ సైన్సెస్/న్యూట్రిషన్).
అనుభవం: కనీసం 2 సంవత్సరాలు. అదేవిధంగా సామాజిక కార్యక్రమాల నిర్వహణలో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. స్థానికభాషలో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇంగ్లిష్ భాషపై పట్టు ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 25 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం: రూ.18,000.
➥ బ్లాక్ కోఆర్డినేటర్: 09 పోస్టులు
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: టెక్నాలజీ అండ్ సాఫ్ట్‌వేర్ విభాగాల్లో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. స్థానికభాషలో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇంగ్లిష్ భాషపై పట్టు ఉండాలి. ఏదైనా సోషల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో ఫ్రంట్‌లైన్ వర్కర్‌గా పనిచేసి ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 25 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం: రూ.20,000.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి, అవసరమైన అన్ని ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలను జతచేసి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.
ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The District Women and Child Welfare and Empowerment Officer,
Chaakirala Mitta, Barampet,
Narasaraopet, Palnadu Distric-522601.
ముఖ్యమైన తేదీలు..
➥ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.11.2023.
➥ ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28.11.2023.
0 comments:
Post a Comment