రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాల్లో ఉద్యోగ మేళాలో నిర్వహిస్తూ కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగానే ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేయనున్నారు.ఈ నెల 13వ తేదీన డోన్ పట్టణంలోని గవర్నమెంట్ ఐ.టీ.ఐ కళాశాలలో ఉదయం 9:00 గంటలకు నిర్వహించనున్నారు.ఈ మెగా జాబ్ మేళాలో 12 ప్రముఖ కంపెనీలు పాల్గొనున్నాయి.
ఈ ఉద్యోగం మేళాలో హెటిరో డ్రగ్స్, ఎస్.బి. ఐ పేమెంట్స్,ఎం. ఎస్. మోటార్స్, ఫ్లిప్కార్ట్ వంటి ప్రముఖ కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పాల్గొంటున్నాయి.దీనికోసం పదవ తరగతి నుంచి B.SC, MSC, ORGANIC CHEMISTRY, బీటెక్, ఎంబీఏ, ఏదైనా డిగ్రీ పూర్తి చేసుకున్న నిరుద్యోగులు పాల్గొన వచ్చు.ఈ ఉద్యోగ మేళా 13-10-2023 వ తేదీ ఉదయం 09:00 గంటల నుండి ఈ ఉద్యోగమేళా జరగనుంది.
0 comments:
Post a Comment