బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకి గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో ఉన్న ది కాకినాడ కో ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్(KCTB)
మొత్తం 33 పోస్ట్ ల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. దరఖాస్తు చేయడానికి ముందు పోస్ట్ సమాచారం, అర్హత, జీతం, వయోపరిమితి, దరఖాస్తు రుసుము,ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవడం ముఖ్యం. వీటన్నింటి గురించిన సమాచారం ఇక్కడ ఉంది.
ఖాళీల వివరాలు
1.క్లర్క్ కమ్ క్యాషియర్:16 పోస్ట్ లు
2.ఆఫీసర్: 9 పోస్ట్ లు
3.అటెండర్ (సబ్ స్లాఫ్): 5 పోస్ట్ లు
4.అసిస్టెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్: 2 పోస్ట్ లు
5.మేనేజర్-లా : 1 పోస్ట్
అర్హత
ఇంటర్మీడియట్,డిప్లామా,డిగ్రీ,పీజీ ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి. అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
వయోపరిమితి
06.10.2023 నాటికి 34 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. బీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీలకు 5 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
అప్లయ్ చేయడం
వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తులు నింపి రిజిస్టర్డ్ పోస్ట్ లేదా కోరియర్ ద్వారా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,కాకినాడ కో ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్,రామారావు పేట,కాకినాడ అడ్రెస్ కు పంపాలి
ఆఫ్ లైన్ దరఖాస్తుకి చివరి తేదీ
31-10-2023.
దరఖాస్తు రుసుము
ఆఫీసర్ క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.500.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. అసిస్టెంట్ సీఈవో, మేనేజర్ పోస్టులకు రూ.1000.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. "The Kakinada Co-Operative Town Bank Ltd, Kakinada" పేరిట కాకినాడలో చెల్లుబాటు అయ్యేలా నిర్ణీత మొత్తంతో డిడి తీయాల్సి ఉంటుంది.
0 comments:
Post a Comment