రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ ఉద్యోగ రాత పరీక్షల తేదీలు వెల్లడి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ ఉద్యోగ రాత పరీక్షల తేదీలు వెల్లడయ్యాయి. గతంలో పేర్కొన్నవి కాకుండా కొత్త పరీక్ష తేదీలను ఆర్బీఐ తాజాగా ప్రకటించింది. ప్రాథమిక పరీక్షను నవంబర్ 18, 19 తేదీల్లో, ప్రధాన పరీక్షను డిసెంబర్ 31వ తేదీల్లో నిర్వహించనున్నట్లు పేర్కొంది. ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు- దేశవ్యాప్తంగా ఆర్బీఐ శాఖల్లో 450 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. నెలకు రూ.20,700 నుంచి రూ.55,700 వేతనం అందుతుంది
0 comments:
Post a Comment