Job Mela: అక్టోబర్ 31న ఉమ్మడి కృష్ణా జిల్లాలో జాబ్ మేళా
ఉమ్మడి కృష్ణా నిరుద్యోగులకు గుడ్ న్యూస్. అక్టోబరు 31న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా నిరుద్యోగులకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి డి.విక్టర్ బాబు తెలిపారు. ప్రభుత్వ ఐటీఐ ఆవరణలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జరిగే జాబ్ మేళాలో రిలయన్స్, జియో కమ్యూనికేషన్స్,యాక్సిస్ బ్యాంక్, ఎయిర్‌టెల్, బజాజ్ అలియాజ్, వరుణ్ మారుతీ, పద్మజ సుజుకీ, వరుణ్ బజాజ్ సంస్థల్లో ఖాళీలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.18-27 ఏళ్ల మధ్య వయస్సు గల వాళ్లు అర్హులని తెలిపారు. నిరుద్యోగులు పూర్తి బయోడేటా, ధ్రువపత్రాల జెరాక్స్ కాపీలతో పాటు ఆధార్ కార్డుతో హాజరుకావాలని కోరారు. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకు శాలరీ వస్తుందని లభిస్తుందని తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు 81424 16211 నంబరులో సంప్రదించవచ్చని చెప్పారు.
0 comments:
Post a Comment