వికాస కార్యాలయంలో ఈనెల 16న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ కె లచ్చారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవి ఆక్వా ఫీడ్స్ కంపెనీలో ట్రైనీ, ఫ్లూయిన్ టు కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్, డెక్కన్ కెమికల్స్ కంపెనీలో ట్రైనీ ప్రొడక్షన్, నిట్ ఐసీఐసీఐ బ్యాంక్లో రిలేషన్ షిప్ మేనేజర్, సోలార్ యాక్టివ్ ఫార్మాసైన్సెస్లో ప్రొడక్షన్ టెక్నిషియన్, రిలయన్స్ రిటైల్స్లో పికింగ్ అండ్ ప్యాకింగ్, డిక్సాన్, హోండాయ్ మోబీస్, అపోలో టైర్స్ కంపెనీల్లో టెక్నిషియన్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఎస్ఎస్సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లామో, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన 35 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులన్నారు. నెలకు రూ.12 వేల నుంచి రూ.25 వేల వరకు జీతం, ఇన్సెంటివ్స్, భోజనం, వ సతి, రవాణా సౌకర్యం ఆయా ఉద్యోగాలను బట్టి ఉంటుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు 16న కలెక్టరేట్ ఆవరణ లోని వికాస కార్యాలయం వద్ద ఉదయం 9 గంటలకు హాజరు కావాలన్నారు.
0 comments:
Post a Comment