ISRO : బీటెక్‌ అర్హతతో 435 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్షలేదు

ISRO Thiruvananthapuram : కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ISRO).. ఆధ్వర్యంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 435 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీలు- 273, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ఖాళీలు- 162 ఉన్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ అప్లయ్‌ చేసుకోవాలి. అయితే.. ఇంటర్వ్యూ, పరీక్షల్లో వచ్చిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. అక్టోబర్‌ 7వ తేదీన నిర్వహించే ఇంటర్వ్యూలకు అభ్యర్థులు హాజరుకావాల్సి ఉంటుంది.


మొత్తం ఖాళీలు: 435
గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీలు: 273
టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ఖాళీలు:

ముఖ్య సమాచారం :
విభాగాలు: ఏరోనాటికల్/ ఏరోస్పేస్, కెమికల్‌, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, మెటలార్జీ, ప్రొడక్షన్‌, ఫైర్‌ అండ్‌ సేఫ్టీ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కేటరింగ్‌ టెక్నాలజీ తదితర విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అర్హత: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60శాతం మార్కులతో బీటెక్‌/ బీఈ/ బీఎస్సీ/ బీకామ్‌/ బీఏ/ బ్చాచిలర్ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: అభ్యర్థుల వయసు 28 ఏళ్లు ఉండాలి.
అప్రెంటిస్‌ శిక్షణ వ్యవధి: 12 నెలలు.
స్టైపెండ్‌: నెలకు రూ.9000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: పరీక్షలో మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది

టెక్నీషియన్‌ అప్రెంటిస్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 30 ఏళ్లు ఉండాలి.
అప్రెంటిస్‌ శిక్షణ వ్యవధి: 12 నెలలు.
స్టైపెండ్‌: నెలకు రూ.8000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, పరీక్షలో మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ, కమలసెరి, ఎర్నాకుళం జిల్లా, కేరళ.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఇంటర్వ్యూ తేదీ: అక్టోబర్‌ 7, 2023
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహిస్తారు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.vssc.gov.in/
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top