మచిలీపట్నంలోని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన కృష్ణా జిల్లాలో ప్రభుత్వాసుపత్రుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు అక్టోబరు 20లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు..
* మొత్తం పోస్టుల సంఖ్య: 54.
➥ ఫిజియోథెరపిస్ట్: 02 పోస్టులు
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (ఫిజియోథెరపీ). కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
జీతం: రూ.36,935.
➥ స్టాఫ్ నర్స్: 24 పోస్టులు
అర్హత: జీఎన్ఎం/బీఎస్సీ నర్సింగ్. కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
జీతం: రూ.32,000.
➥ మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్: 08 పోస్టులు
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఏడాదిన్నర మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్-సర్టిఫికేట్ కోర్సు పూర్తిచేసి ఉండాలి. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వం తప్పనిసరి.
జీతం: రూ.27,000.
➥ మెడికల్ ఆఫీసర్: 10 పోస్టులు
అర్హత: ఎంబీబీఎస్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
జీతం: రూ.53,465.
➥ ఎల్‌జీఎస్: 04 పోస్టులు
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
జీతం: రూ.15,000.
➥ సపోర్టింగ్ స్టాఫ్: 3 పోస్టులు
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
జీతం: రూ.15,000.
➥ సెక్యూరిటీ గార్డ్: 1 పోస్టు
అర్హత: ఎక్స్-సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ లేదా పదోతరగతి అర్హత ఉండాలి.
జీతం: రూ.15,000.
వయోపరిమితి: 01.01.2023 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా:
Office of the District Medical and Health Officer,
Parasupeta, Near Nayarbaddi centre,
Machilipatnam, Krishna district.
దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 20.10.2023.
0 comments:
Post a Comment