అమరరాజ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లో నిరుద్యోగ యువతకి ఉచిత శిక్షణ లభిస్తోంది. ఉపకార వేతనం తో పాటు ఉద్యోగ అవకాశాలు కలవని అమరరాజా యాజమాన్యం తెలిపారు. అమరరాజా సంస్థ మద్దతు రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2014లో అమరరాజా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ని చిత్తూరు జిల్లా, పూతలపట్టు మండలం, పేటమెట్ట గ్రామంలో ఈ సెంటర్ ఏర్పాటైంది. ఇప్పటివరకు ఈ సంస్థ ద్వారా 14 బ్యాచులు 1314 మంది నిరుద్యోగ యువత తమ సెంటర్‌లో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు.
ఇలా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 1314 మందికి అమరరాజా సంస్థలో పర్మనెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లో 18 బ్యాచ్‌లో 1370 మంది నిరుద్యోగ యువత శిక్షణ పొందారు. అమర రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లో 10వ తరగతి పాస్ ఫెయిల్ లేదా ఇంటర్ పాస్ ఫెయిల్ అయిన నిరుద్యోగ యువతీ యువకులుకి 33వ బ్యాచ్ అడ్మిషన్స్ ప్రారంభం కానున్నాయి.
.ఎంపికైన విద్యార్థులకు శిక్షణ కాలంలో మొదటి మూడు నెలలు, నెలకు రూ.7500 చొప్పున ఉపకార వేతనం లభిస్తుంది. ఆ తర్వాత 21 నెలలు రూ.11,453 నుంచి రూ.11853 మధ్య ఉపకార వేతనము లభిస్తోంది
ఇక 33వ బ్యాచ్ అడ్మిషన్లు ఈనెల 26 నుంచి ప్రారంభమవుతాయి. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ యాజమాన్యం తెలిపింది. పూర్తి వివరాల కోసం 9000024919, 9100477371 నెంబర్లలో సంప్రదించవచ్చు
0 comments:
Post a Comment