AP University Vacancies: ఏపీలోని యూనివర్సిటీల్లో 3,220 టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల - వివరాలు ఇలా

AP University Jobs: ఏపీలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అక్టోబరు 30న నోటిఫికేషన్లు వెలువడ్డాయి. యూనివర్సిటీలవారీగా నోటిఫికేషన్లను విడుదల చేశారు. వీటిద్వారా రాష్ట్రంలోని మొత్తం 18 విశ్వవిద్యాలయాల్లో 3,220 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాక్‌లాగ్ పోస్టులతోపాటు రెగ్యులర్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. వీటిలో బ్యాక్‌లాగ్ పోస్టులు 278, రెగ్యులర్ పోస్టులు 2942 ఉన్నాయి. వీటిలో ప్రొఫెసర్ 418 పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్ 801  పోస్టులు, ట్రిపుల్ ఐటీల లెక్చరర్ పోస్టులతో కలిపి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 2,001 ఉన్నాయి.

పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా నవంబరు 20న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. నవంబరు 27లోపు దరఖాస్తు హార్డ్‌కాపీలను సమర్పించాల్సి ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా నియామకాలు చేపడతారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం సహాయ ఆచార్యుల స్క్రీనింగ్ పరీక్షకు అర్హత సాధించిన వారి జాబితాను 30న వర్సిటీలు ప్రకటిస్తాయి. వీటిపై డిసెంబరు 7 వరకు అభ్యంతరాలను స్వీకరించి, డిసెంబరు 8న తుది జాబితాను ప్రకటిస్తాయి. స్క్రీనింగ్ పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహించనుంది. 

పోస్టుల భర్తీకి 2017, 2018ల్లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసినందున కొత్త నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వర్సిటీలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున కోర్టు తీర్పునకు లోబడి నియామక ప్రక్రియ ఉంటుందని వెల్లడించాయి. వర్సిటీ యూనిట్‌గా కొత్తగా రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లతో పోస్టులను ప్రకటించాయి. అసోసియేట్ ఆచార్యులు, ప్రొఫెసర్ పోస్టులకు ఉమ్మడి పరీక్ష ఉండదు. విశ్వవిద్యాలయాల స్థాయిలోనే నియామకాలు చేపడతారు. 

వివరాలు..

వివరాలు..

ఖాళీల సంఖ్య: 3220 పోస్టులు

➥ అసిస్టెంట్ ప్రొఫెసర్: 2001 పోస్టులు

➥ అసోసియేట్ ప్రొఫెసర్: 801 పోస్టులు

➥ ప్రొఫెసర్: 418 పోస్టులు

పీహెచ్‌డీతోపాటు GATE / GPAT / CEED అర్హత ఉన్నవారు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హులు.

దరఖాస్తు ఫీజు..

➥ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.2500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.2000 చెల్లించాలి. ఓవర్‌సీస్ అభ్యర్థులు 50 అమెరికన్ డాలర్లు లేదా రూ.4200 చెల్లించాల్సి ఉంటుంది. ఒకటికంటే ఎక్కువ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేవారు వేర్వేరుగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

➥ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.3000. ఓవర్‌సీస్ అభ్యర్థులు 100 అమెరికన్ డాలర్లు లేదా రూ.8,400 చెల్లించాల్సి ఉంటుంది.

➥ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.3000. ఓవర్‌సీస్ అభ్యర్థులు 150 అమెరికన్ డాలర్లు లేదా రూ.12,600 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు హార్డ్ కాపీలను సంబంధిత చిరునామాకు నిర్ణీత గడువులోగా చేరేలా పంపాలి.

ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.

పరీక్ష విధానం..
స్క్రీనింగ్ రాత పరీక్షను ఏపీపీఎస్సీ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుంది. 3 గంటల సమయంలో మొత్తం 150 బహుళైచ్ఛిక ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు, ఒక తప్పునకు ఒక మైనస్ మార్కు ఉంటుంది. ఈ పరీక్షలో వచ్చిన మార్కులు, అకడమిక్ ప్రాధాన్యంగా ఇంటర్వ్యూకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం..

➥ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ.57,700 - రూ.1,82,400;

➥ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ.1,31,400 - రూ.2,17,100;

➥ ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ.1,44,200 - రూ.2,18,200 చెల్లిస్తారు.

ముఖ్యమైన తేదీలు..

➥ నోటిఫికేషన్ల వెల్లడి: 30.10.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.10.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.11.2023.

➥ దరఖాస్తు హార్డ్ కాపీల సమర్పణకు చివరితేది: 27.11.2023.

➥ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ప్రాథమిక జాబితా వెల్లడి: 30.11.2023.

➥ ప్రాథమిక జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు చివరితేది: 07.12.2023.

➥ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల తుది ఎంపిక జాబితా వెల్లడి: 08.12.2023.
Notifications

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top