విశాఖపట్నంలోని విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 24లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారువివరాలు..
➥ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 16 పోస్టులు
➥ టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్: 24 పోస్టులు
విభాగాలు: మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ కంట్రోల్ ఇంజినీరింగ్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్,కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్.
శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.
అర్హతలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. నేషనల అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (నాట్స్) రిజిస్టర్ అయి ఉండాలి.
ఎంపిక విధానం: గ్రాడ్యుయేట్/ డిప్లొమా మార్కుల ఆధారంగా.
స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు నెలకు రూ.9,000. టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు నెలకు రూ.8,000 ఇస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 24.10.2023.
వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఈ వాట్సాప్ గ్రూప్ లో చేరండి
0 comments:
Post a Comment