ఈస్టర్న్ రైల్వే ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఈస్టర్న్ రైల్వే పరిధిలోని వివిధ డివిజన్లలో ఖాళీగా ఉన్న మొత్తం 3115 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 27న ప్రారంభంకాగా.. అక్టోబరు 26 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.ఖాళీల సంఖ్య: 3115
డివిజన్లవారీగా ఖాళీలు:
➥ హౌరా డివిజన్: 659
➥ లిలుహ్ డివిజన్: 612
➥ సీల్దా డివిజన్: 440
➥ కం చరపర వర్క్ షాప్: 187
➥ మాల్డా డివిజన్: 138
➥ అసన్సో ల్ డివిజన్: 412
➥ జమాల్‌పూర్ వర్క్ షాప్-667
విభాగాలు: ఫిట్టర్, మెషినిస్ట్, టర్నర్, పెయింటర్, వైర్‌మెన్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెకానిక్, కార్పెంటర్, లైన్ మ్యాన్, రిఫ్రిజిరేటర్ & ఏసీ మెకానిక్, మాసన్, బ్లాక్ స్మిత్,
అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉండాలి.
వయోపరిమితి: 15-24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రిజర్వేషన్, ఇతర అర్హతల ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.09.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 26.10.2023.
వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఈ వాట్సాప్ గ్రూప్ లో చేరండి
0 comments:
Post a Comment