తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2023 ఫలితాలు సెప్టెంబర్ 27 విడుదలయ్యాయి. ఉదయం 10 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్సైట్లో ఫలితాలు అందుబాటులో ఉంచారు. ఫలితాలతోపాటు తుది ఆన్సర్ 'కీ'ని కూడా అధికారులు విడుదల చేశారు. సెప్టెంబరు 15న నిర్వహించిన టెట్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని సెప్టెంబరు 20న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి సెప్టెంబరు 23 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ఇక సెప్టెంబరు 27న తుది ఆన్సర్ కీతోపాటు ఫలితాలను విడుదల చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment