స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) కూడా అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్నవారు అధికారిక పోర్టల్ www.apprenticeshipindia.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ గడువు సెప్టెంబర్ 30న ముగుస్తుంది.
* ఖాళీల వివరాలు
గ్రాడ్యుయేట్, టెక్నిషియన్, ట్రేడ్ అప్రెంటిస్‌కు సంబంధించి మొత్తంగా 336 అప్రెంటిస్ ఖాళీలను సెయిల్ భర్తీ చేస్తుంది. ఈ లిస్టులో ట్రేడ్ అప్రెంటిస్-152 పోస్టులు, టెక్నీషియన్ అప్రెంటిస్- 136 ఉద్యోగాలు , గ్రాడ్యుయేట్ అప్రెంటిస్- 48 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
* వయోపరిమితి
సెయిల్ అప్రెంటిషిప్ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల వయసు 2023 సెప్టెంబర్ 30 నాటికి 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్
ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలకు, గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. టెక్నిషియన్ అప్రెంటిస్ పోస్టులకు, గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి డిప్లొమా క్లియర్ చేసినవారు అప్లై చేసుకోవడానికి అర్హులు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలకు, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా ఫీల్డ్‌లో బ్యాచిలర్ డిగ్రీ చదివిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
* అప్లికేషన్ ప్రాసెస్
- ముందు అధికారిక పోర్టల్ www.apprenticeshipindia.gov.in ఓపెన్ చేయాలి.
- హోమ్‌పేజీలోకి వెళ్లి, సెయిల్ అప్రెంటిషిప్-2023 అనే లింక్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్ పూర్తి వివరాలు చెక్ చేయాలి.
- అర్హత ఉన్న అప్రెంటిస్ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం అభ్యర్థులు మొబైల్ నంబర్, ఇమెయిల్ వంటి వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి.ఆ తరువాత రిజిస్టర్ ఐడీ, పాస్ వర్డ్ సాయంతో లాగిన్ అయి 'అప్రెంటిస్ ఆపర్చునిటిస్' అనే లింక్‌పై క్లిక్ చేయాలి. దీంతో అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.
- ఇక్కడ అన్ని వివరాలను ఎంటర్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. చివరగా అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి. ఎంపిక ప్రక్రియ
డిగ్రీ, డిప్లొమా, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేసి ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు స్టైఫండ్ కూడా లభిస్తుంది. వీరు ఒక సంవత్సర కాలం పాటు ఒడిశాలోని రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో అప్రెంటిస్ గా వర్క్ చేయాల్సి ఉంటుంది.
0 comments:
Post a Comment