శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని 11 ఐ.సి.డి.యస్. ప్రాజెక్టులు, 1. ధర్మవరం 2. సి.కే. పల్లి, 3. పెనుకొండ 4. మడకశిర 5. గుడిబండ 6. సోమందేపల్లి, 7. హిందూపురం 8, పుట్టపర్తి 9. ఒధులదేవర చెరువు 10. నల్లచెరువు మరియు 11 కదిరి నందు ఖాళీగా వున్నా అంగన్వాడీ కార్యకర్తలు-05 మినీ అంగన్వాడి కార్యకర్తలు - 5 మరియు సహాయకులు -55 ఉద్యోగములకు అర్హులైన అభ్యర్ధుల నుండి తేది: 21-09-2023 నుండి 29-09-2023 సాయంత్రం 5.00 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించబడును. గడువు దాటినా పిమ్మట ఎట్టిపరిస్థితుల్లోనూ దరఖాస్తులు స్వీకరించబడవు, ఈ ఉద్యోగములకు 10 వ తరగతి పాస్ అయివుండవలెను, స్థాణికరాలై వుండవలెను, మరియు తేది: 01-07-2023 నాటికి 21 సంవత్సరములు పూర్తియి 35 సంవత్సరముల లోపు వుండవలెను. యస్.సి. మరియు యస్.టి. అభ్యర్థులు 21 సంవత్సరములు నిండిన వారు లేని యెడల 18 సంవత్సరముల వారు కూడా అర్హులు. అంగన్వాడి కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు మరియు అంగన్వాడి సహాయకుల ఉద్యోగములకు యస్.సి. మరియు యస్.టి. హాబిటేషన్స్ నందు ఉండు యస్.సి. మరియు యస్.టి. అభ్యర్థులు మాత్రమె అర్హులు. ఇతర వివరముల కొరకు ఇందువెంట జతచేసిన ఉద్యోగ ప్రకట నోటిఫికేషన్ చూడవలెను అని శ్రీమతి యస్. లక్ష్మి కుమారి, జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి, శ్రీ సత్యసాయి జిల్లా (పుట్టపర్తి) వారు పత్రిక ప్రకటన జారి చేసినారు.
Join Our Latest Free Updates:
0 comments:
Post a Comment