అగ్నిపథ్ పథకం కింద 2023 - 24 సంవత్సరం అగ్నివీరుల నియామకాల తుది మెరిట్ జాబితా ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 17న కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెల్లడించిన విషయం తెలిసిందే. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్/ స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్మ్యాన్ కేటగిరీల్లో ఖాళీలు భర్తీ కానున్నాయి. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి శారీరక సామర్థ్య, వైద్య పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థుల వడపోత అనంతరం నాలుగేళ్ల కాలానికి అగ్నివీరులను ఎంపిక చేస్తారు. ఏఆర్వో చెన్నై, విశాఖపట్నం, గుంటూరు, అంబాల, పుణె, జలంధర్, కోల్కతా, భోపాల్, ఢిల్లీ, రాంచీ తదితర జోన్లకు సంబంధించి ఫలితాలు వెలువడ్డాయి. ఏఆర్వో సికింద్రాబాద్ జోన్ ఫలితాలు విడుదల కావాల్సి ఉంది
Join Our Latest Free Updates:
0 comments:
Post a Comment