Job Mela: 26న జాబ్‌మేళా
తమ్మినాయుడు కళాశాల ప్రాంగణంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 26న నిర్వహించే జాబ్‌మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ కోరారు. జాబ్ మేళాకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 కంపెనీలకు చెందిన ప్రతి నిధులు హాజరై ఉద్యోగాలకు ఎంపిక చేస్తారన్నారు. పదోతరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లమా, డి గ్రీ, పీజీ, ఇంజినీరింగ్ చదివిన విద్యార్థులు జాబ్‌మేళాలో పాల్గొనవచ్చని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికా రి సాయికుమార్ తెలిపారు. పూర్తి వివరాలకు ఫోన్: 7993795796నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
0 comments:
Post a Comment