సదరన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్‌లో సివిలియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 24 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 8 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు..
* మొత్తం ఖాళీలు: 24
➥ ఎంటీఎస్(మెసెంజర్): 13
➥ ఎంటీఎస్(డాఫ్టరీ): 03
➥ కుక్: 02
➥ వాషర్‌మ్యాన్: 02
➥ మజ్దూర్: 03
➥ ఎంటీఎస్(గార్డనర్): 01
అర్హత: పోస్టులను అనుసరించి మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత.
వయోసరిమితి: 18-25 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ స్కిల్ టెస్ట్, షార్ట్‌లిస్టింగ్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీతభత్యాలు: నెలకు రూ.18000-రూ.56,900 చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:18.09.2023.
➥ దరఖాస్తుకు చివరితేదీ: 08.10.2023
0 comments:
Post a Comment