కంచరపాలెం జిల్లా ఉపాధి కార్యాలయంలోని నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్‌లో ఈ నెల 15న జాబ్‌మేళా నిర్వహిస్తున్న ట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారులు సీహెచ్ సుబ్బిరెడ్డి(క్లరికల్), కె.శాంతి(టెక్నికల్) తెలిపారు.
టెక్నోసాఫ్ట్ సొల్యూషన్స్, వోల్టా ష్యాషన్స్, ఏడీఎల్ ఆగ్రో ఫార్మ్, శ్రీరామ్ ఫైనాన్స్, రిలయన్స్ జియో, వరుణ్ మోటర్స్, టీం లీజ్, యూనియన్ బ్యాంక్, రెడ్డీస్ లేబొరేటరీస్, బిగ్‌బాస్కెట్, సెవెన్ హిల్స్ హెల్త్ కేర్ తదితర కంపెనీల్లో 873 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశారు. అసోసియేట్ ఏజెన్సీ, సూయింగ్ మిషన్ ఆపరేటర్, బిల్లింగ్, కస్టమర్ అండ్ ఫీల్డ్ ట్రైనీ, సేల్స్ డెవలప్‌మెంట్ మేనేజర్, ఫార్మాసిస్ట్, అసెంబ్లీ ఆపరేటింగ్ కాల్ అసిస్టెంట్, ఆపరేటర్, కస్టమర్ ఎగ్జిక్యూటివ్, కెమిస్ట్, క్యాషియర్, డెలివరీ ఎగ్జిక్యూటివ్స్, డ్యూటీ మెడికల్ ఆఫీసర్, వేర్‌హౌస్ అసోసియేట్స్, టీం లీడర్స్, స్టాఫ్ నర్స్, ఇన్‌చార్జి నర్స్, అకౌంటెంట్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్, కేర్ టేకర్స్, కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, ఏదైనా డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్, పీజీ, ఐటీఐ, డిప్లమా, బీటెక్, ఎంబీఏ పూర్తి చేసిన వారు అర్హులు. ఆసక్తి ఉన్న 18-35 ఏళ్ల పురుష, మహిళా అభ్యర్థులు www.ncs.gov.in/ లో పేర్లు నమోదు చేసుకుని ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు.
0 comments:
Post a Comment