వైఎస్సార్ జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 85 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 08 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 85
* అంగన్‌వాడీ వర్కర్: 11
* అంగన్వాడీ హెల్పర్: 72
* అంగన్‌వాడీ వర్కర్: 02
ఐసీడీఎస్ ప్రాజెక్టు పేరు: కడప, సీకే దిన్నె, ముద్దనూరు, ప్రొద్దుటూరు అర్బన్/ రూరల్, పులివెందుల, బద్వేల్, కమలాపురం, జమ్మలమడుగు, వేంపల్లి, మైదుకూరు, చాపాడు.
అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను సంబంధిత వైఎస్సార్ జిల్లాలోని సీడీపీవో కార్యాలయం చిరునామాకు పంపాలి.
ఎంపిక విధానం: నిబంధనల మేరకు.
వేతనం: అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.11500, అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.7000.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 08.09.2023.
0 comments:
Post a Comment