Technical Jobs: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు టెక్నికల్ ఉద్యోగాలు.. నెలకు రూ.1.12లక్షల జీతం..

నిరుద్యోగులకు ఎప్పుడూ లేనన్ని అవకాశాలు ప్రస్తుతం లభిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే వివిధ సంస్థలు వరుసగా నియామక ప్రక్రియ చేపడుతున్నాయి.
ముఖ్యంగా ఇంజనీరింగ్ చదివిన వారికి కొత్త అవకాశాలు తలుపు తడుతున్నాయి. తాజాగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ట్రైబల్ హెల్త్- జబల్‌పూర్ (NIRTH-Jabalpur) వివిధ టెక్నికల్ పోస్ట్‌ల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌తో సంస్థ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, లేబోరేటరీ అటెండెంట్ వంటి పోస్టులను భర్తీ చేస్తుంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

NIRTH- జబల్‌పూర్ రిక్రూట్మెంట్‌కు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, ఆగస్టు 21తో ఈ గడువు ముగుస్తుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రైబల్ హెల్త్ అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఆధ్వర్యంలో పనిచేస్తుంది. రిక్రూట్‌మెంట్ పూర్తి వివరాలను పరిశీలిద్దాం. 

* ఖాళీల వివరాలు
NIRTH రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తంగా 52 టెక్నికల్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఇందులో టెక్నికల్ అసిస్టెంట్ 23, టెక్నీషియన్-I 17, లేబోరేటరీ అటెండెంట్-I 12 పోస్టులు ఉన్నాయి. 

* అర్హత ప్రమాణాలు

-టెక్నికల్ అసిస్టెంట్ 

ఈ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 30 ఏళ్లలోపు ఉండాలి. సంబంధిత ఫీల్డ్‌లో బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

- టెక్నీషియన్-I 

అభ్యర్థుల వయసు 28 ఏళ్లలోపు ఉండాలి. సైన్స్ గ్రూప్‌తో ఇంటర్ పాసై ఉండాలి. సంబంధిత ఫీల్డ్‌లో డిప్లొమా సర్టిఫికేట్ కూడా తప్పనిసరి. 

- లేబోరేటరీ అటెండెంట్-I 
అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. పదో తరగతి తప్పనిసరిగా పాసై ఉండాలి. ఐటీఐ సర్టిఫికేట్ లేదా సంబంధిత ఫీల్డ్‌లో వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. 

ఇది కూడా చదవండి :నిరుద్యోగులకు అలర్ట్.. ప్రముఖ బ్యాంక్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ, క్లర్క్ ఉద్యోగాలు ..

* అప్లికేషన్ ప్రాసెస్

- ముందుగా ఐసీఎంఆర్ ఎన్‌ఐఆర్‌టీహెచ్ అధికారిక పోర్టల్ www.nirth.res.in ఓపెన్ చేయాలి. 

- హోమ్‌పేజీలోకి వెళ్లి రెగ్యులర్ పోస్ట్స్ టెక్నికల్ కేడర్(టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, లేబోరేటరీ అటెండెంట్) అనే రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయాలి. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. 

కొత్తగా రిజిస్ట్రేషన్ చేయాల్సిన అభ్యర్థులు ముందుగా తమ పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ వంటి వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత రిజిస్టర్ ఐడీ, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి. 

- అనంతరం అర్హత ఉన్న పోస్ట్‌కు అప్లికేషన్ ఫారమ్‌ను ఫిలప్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

- అవసరమైన డాక్యుమెంట్స్‌ను అప్‌లోడ్ చేయాలి. చివరగా అప్లికేషన్ ఫారమ్ సబ్‌మిట్ చేయాలి. 

* అప్లికేషన్ ఫీజు

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.300 ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళ, ఎక్స్- సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. దీంతో వీరు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

* ఎంపిక ప్రక్రియ
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా.. మొదటి దశలో ఆన్ లైన్ రాత పరీక్ష ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వారికి రెండో దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, మూడో దశలో మెడికల్ ఎగ్జామినేషన్ జరగనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనున్నారు. రాత పరీక్షకు 95 పాయింట్లు, పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్‌కు 5 పాయింట్స్ కేటాయిస్తారు. మొత్తంగా 100 మార్కులకు తుది ర్యాంకింగ్ ప్రకటిస్తారు. రాత పరీక్షలో జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు పాస్ కావాలంటే కనీసం 50 శాతం స్కోర్ చేయాలి. SC/ST/PwBD అభ్యర్థులు 40 శాతం స్కోర్ చేయాలి. 

* జీతభత్యాలు

టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్‌కు ఎంపికయ్యే అభ్యర్థులకు లెవల్-6 ప్రకారం.. జీతం నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 లభిస్తుంది. టెక్నిషియన్‌కు లెవల్ -2 ప్రకారం.. రూ.19,900 నుంచి రూ.63,200... లేబోరేటరీ అటెండెంట్‌కు లెవల్ -1 ప్రకారం.. రూ.18000 నుంచి 56,900 మధ్య జీతం ఉంటుంది.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top