SSC CGL: సీజీఎల్ 2023 'టైర్-1' ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం

కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(సీజీఎల్‌)-2023 టైర్-1 పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆగస్టు 1న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రూల్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ఆన్సర్ కీ చూసుకోవచ్చు. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అందుబాటులో ఉంచింది. 
ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి ఆగస్టు 4న సాయంత్రం 6 గంటల వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలియజేయవచ్చు. అభ్యర్థులు అభ్యంతరాలు తెలిపే ఒక్కో ప్రశ్నకు రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ ద్వారానే అభ్యంతరాలు తెలపడానికి అవకాశం కల్పించారు.

ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో 7,500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్, ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఆడిటర్, అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి. 

సీజీఎల్‌ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా డిగ్రీ, సీఏ, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఏప్రిల్‌ 3 నుంచి మే 3 తేదీల్లో దరఖాస్తు చేసుకున్నారు. టైర్‌-1, టైర్‌-2 ఎగ్జామినేషన్‌, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్/ మెడికల్ టెస్టులు, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆయా పోస్టులను బట్టి వేతనం నెలకు రూ.25,500 నుంచి రూ.1,51,100 ఉంటుంది

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top