IOCL : ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో 490 ఖాళీల భర్తీ.. ఉండాల్సిన అర్హతలివే

IOCL Recruitment 2023 : చెన్నైలోని అతిపెద్ద భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL).. సదరన్ డివిజన్ పరిధిలోని ఆరు రీజియన్‌లలో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 490 అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రీజియన్లలో ఈ ఖాళీలున్నాయి. పూర్తి వివరాల్లోకెళ్తే..
మొత్తం ఖాళీలు - 490

ట్రేడ్ అప్రెంటిస్: 150 ఖాళీలు
టెక్నీషియన్ అప్రెంటిస్: 110 ఖాళీలు
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్/ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్: 230 ఖాళీలు

ముఖ్య సమాచారం :

రీజియన్లు: తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రీజియన్లలో ఈ ఖాళీలున్నాయి.
విభాగాలు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, సివిల్, ఎలక్ట్రానిక్స్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.

అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీబీఏ, బీఏ, బీకాం, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 31-08-2023 నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, వైద్య పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తులు ప్రారంభ తేదీ: ఆగస్టు 25, 2023
దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 10, 2023

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://iocl.com/apprenticeships

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top