ECIL Recruitment : ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్)లో ఉద్యోగ ఖాళీల భర్తీ
ECIL Recruitment : హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్)లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఖాళీల భర్తీ చేపట్టనున్నారుదేశ వ్యాప్తంగా ఉన్న ఈసీఐఎల్ కేంద్రాల్లో మొత్తం 163 ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.45,000 నుంచి రూ.55,000. టెక్నికల్ ఆఫీసర్‌కు రూ.25,000 నుంచి రూ.31,000. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.24,500 నుంచి రూ.30,000. చెల్లిస్తారుఎంపికైన అభ్యర్ధులు ప్రాజెక్ట్ లొకేషన్స్ షిల్లాంగ్, బరక్‌పుర్, కోల్‌కతా, టాటానగర్, నారేంగి, హైదరాబాద్, వైజాగ్, రావత్‌భట, గోరఖ్‌పూర్, నరోరా, లేహ్, అనుప్‌గఢ్, న్యూదిల్లీ, ఫిరోజ్‌పూర్, గురుగ్రామ్, లఖ్‌నవూ, ఆజంగఢ్, అలహాబాద్, కైగా, గౌరీబిదనూర్, కొచ్చిన్, న్యూ మంగళూరు, ట్యుటికోరిన్, కుడంకుళం, కక్రపర్, జామ్‌నగర్, నాలియా, ద్వారక, ముంబయి, తారాపూర్ లలో పనిచేయాల్సి ఉంటుందిదరఖాస్తు విధానానికి సంబంధించి అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని పూర్తి చేసిన తర్వాత సంబంధిత ధృవపత్రాలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఇంటర్వ్యూ తేదీలు: 01.09.2023, 04.09.2023.గా నిర్ణయించారు. ముంబయి, చెన్నై, న్యూదిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నంలోని ఈసీఐఎల్ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. పూర్తి వివరాలకు వెబ్ సైట్; https://www.ecil.co.in/jobs.html పరిశీలించగలరు.
0 comments:
Post a Comment