ECIL TO Notification: హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత గల వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆగస్టు 10, 11 తేదీలలో ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్‌లు, సెల్ఫ్-అటెస్టెడ్ ఫోటోకాపీల సెట్‌తో పాటుగా పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ & రెజ్యూమ్‌తో ఉదయం 09.00 గంటలకు రిపోర్ట్ చేయాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్, షార్ట్‌లిస్టెడ్, పర్సనల్ ఇంటర్వ్యూ, వెయిటేజీ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 100
* టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
అర్హత: అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: సంబంధిత వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఒరిజినల్ సర్టిఫికేట్‌లు, సెల్ఫ్-అటెస్టెడ్ ఫోటోకాపీల సెట్‌తో పాటుగా పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ & రెజ్యూమ్‌తో ఉదయం 09.00 గంటలకు రిపోర్ట్ చేయాలి.
ఎంపిక విధానం: డాక్యుమెంట్ వెరిఫికేషన్, షార్ట్‌లిస్టెడ్, పర్సనల్ ఇంటర్వ్యూ, వెయిటేజీ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వెయిటేజీ / మార్కులు: సంబంధిత ఇంజినీరింగ్ పర్సంటేజ్‌లో 20 మార్కులు; పని అనుభవానికి ఒక సంవత్సరం అనుభవానికి 10 మార్కుల చొప్పున ప్రతి అదనపు సంవత్సరం గరిష్టంగా ప్రారంభ మార్కులతో కలిపి 30 మార్కుల వరకు; పర్సనల్ ఇంటర్వ్యూకి 50 కేటాయించారు.
జీతభత్యాలు: మొదటి సంవత్సరం నెలకు రూ.25,000; రెండవ సంవత్సరం నెలకు రూ.28,000; మూడు & నాలుగు సంవత్సరాలకు నెలకు రూ. 31000 చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక: Corporate Learning & Development Centre,
Nalanda Complex, TIFR Road,
Electronics Corporation of India Limited, ECIL Post, Hyderabad – 500062.
ముఖ్యమైన తేదీలు..
ఇంటర్వ్యూ తేదీ: 10-08-2023 & 11-08-2023 (రిజిస్ట్రేషన్ సమయం ఉదయం 09.00 - ఉదయం11.30 రెండు రోజుల్లో)
Official Website: Click Here
0 comments:
Post a Comment