APSRTC అప్రెంటిస్ విధానం ద్వారా పోస్టులు భర్తీకి నోటిఫికేషన్

ఏ.పి.యస్.ఆర్.టి.సి. నందు అప్రెంటిసెప్ చేయుటకు ఆసక్తి కలిగి, ఈ క్రింద కనపరచిన ట్రేడ్ల నందు ITI ఉత్తీర్ణులైన వారు 08.09.2023 వ తేది లోగా ఆన్ లైన్ వెబ్ సైట్ అడ్రస్ www.apprenticeshipindia.gov.in నందు దరఖాస్తు చేసుకొన వలసినది గా తెలియజేయడమైనది. 08.09.2023 వ తేది తదుపరి తేదిలలో దరఖాస్తు చేసుకొన్న వారి దరఖాస్తులు ఎట్టి పరిస్థితులలో పరిగణనలోకి తీసుకొనబడవు,

అభ్యర్థులు క్రింద తెలిపిన సూచనలను చదివి వాటిని తప్పక పాటించవలసినదిగా కోరడమైనది.

1) ఖాళీల సంఖ్య- చిత్తూరు, తిరుపతి, SPSR నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాల నందు వున్న ITI ల నుండి ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు

2 ) నమోదు చేయు విధానము I.T.J ఉత్తీర్ణులైన అభ్యర్థులు వారి పూర్తి వివరములను ఆన్ లైన్ వెబ్ సైట్ అడ్రస్ www.apprenticeshipindia.gov.in నందు నమోదు చేసుకొన్న తర్వాత వారు వెబ్ సైట్ నందు "lagin" అయ్యి వారు అప్రెంటిసెప్ చేయదలచుకున్న జిల్లా ను ఎంచుకొని పోర్టల్ ద్వారానే అప్లై చేయవలెను. జిల్లా మరియు ఎస్టాబ్లిష్మెంట్ వివరములు ఈ క్రింద కనపరచబడినది
3) రుసుము - ఏ.పి.యస్.ఆర్.టి.సి. నందు అప్రెంటిస్ కొరకు ఆన్ లైన్ నందు దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు ఒక సిట్ జెరాక్స్ కాపిలతో వెరిఫికేషన్ కొరకు జోనల్ సిబ్బంది శిక్షణా కళాశాల, ఏ.పి.యస్.ఆర్.టి.సి, కాకుటూరు, నెల్లూరు నందు హాజరు కావలసియుండును. వెరిఫికేషన్ కు హాజరు అయ్యే అభ్యర్థులు రూ.100/- రుసుము చెల్లించవలెను. వెరిఫికేషన్ జరుగు తేదీ దినపత్రిక ల ద్వారా తెలియజేయబడును.

4) సర్టిఫికేట్స్ మరియు నకళ్ళు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెనువెంటనే ఈ క్రింద తెలిపిన certificates యొక్క నకలును మా కార్యాలయమునకు 11.09.2023 తేదీలోగా చేరునట్లు పంపవలసినది గా కోరడమైనది. సర్టిఫికేట్స్ ను పంపునపుడు తగిన విదముగా పూర్తి చేసిన "RESUME" తో పాటుగా పంపవలెను. "RESUME" కాపి ని ఇందువెంట జతచేయడమైనది.

A) పంపవలసిన certificates వళళ్ళు:-
ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థి యొక్క ప్రొఫైల్ 11) www.apprenticeshipindia.gov.in 6 Apprenticeship Registraton Number(ARN).

S.S.C Marks list.

I.T.I, Marks (Consolidated Marks Memo)

NCVT Certificate

vij SC/ST/BC (పర్మనెంట్ సర్టిఫికేట్ లేనియెడల ఆరు నెలల లోపు జారీ చేయబడిన తాత్కాలిక

కుల ధృవీకరణ పత్రము)

vii) వికలాంగులైనచో ధృవీకరణ పత్రము

మాజీ సైనికోద్యోగుల పిల్లలైనచో ధృవీకరణ పత్రము

NCC మరియు Sports ఉన్నచో సంబంధిత ధృవీకరణ పత్రము లు మరియు

ఆధార్ కార్డు,

నకళ్ళు పంపవలసిన చిరునామా:-

Principal.

Zonal Staff Training College,

Kakutur, Venkachalam Mandal

SPSR Nellore District PIN: 524320

C) ఈ నోటిఫికేషన్ తో పాటు అభ్యర్థి "RESUME" నమూనా జతచేయడమైనది. అభ్యర్థులు Resume నకలును print తీసుకొని, అందులోని అన్ని వివరములు పొందుపరచవలెను. Certificates తో పాటు 'Resume" జత చేసి పైన తెలిపిన చిరునామా కు పోస్ట్ ద్వారా పంపవలెను.

Djఇంటర్వ్యూ కు హాజరైనపుడు అభ్యర్థులు పైన తెలిపిన తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో పాటు ఒక జత నకలు తీసుకు రావలెను.

ముఖ్య గమనిక :

1) ఆన్ లైన్ నందు 08.09.2023 వ తేదీ లోగా దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులు మాత్రమే వెరిఫికేషన్ కొరకు హాజరు కావలెను. ఆన్ లైన్లో సమర్పించిన దరఖాస్తు లు మాత్రమే స్వీకరించబడును. వేరే ఏ మాధ్యము ద్వారా సమర్పించినను స్వీకరించబడవు.

2) ఆన్ లైన్ దరఖాస్తు నందు ఆధార్ కార్డు ను తప్పనిసరిగా నమెదు చేయవలెను (E-KYC) మరియు ఆధార్ కార్డు లో వున్న వివరములు సర్టిఫికేట్స్ లో ఉన్నటువంటి వివరములతో సరిపోవలెను.

3) పోర్టల్ నందు అప్రెంటిసెప్ కొరకు అప్లై చేయునపుడు ఏమైనా సందేహములు వున్న ఎడల మీరు మీ ITI కాలేజి. నందు సంప్రదించవచ్చును.

4) ఏదైనా సందేహము వున్న ఎడల Phone No. 9949810012, 9154291408 లకు ఆఫీసు సమయములో మాత్రమే అనగా ఉ: 10.00 గంటల నుండి సా: 05.00 గంటల వరకు సంప్రదించవలసినదిగా కోరడమైనది.

5) ఈ ప్రకటన మీకు దగ్గరలోని డిపో మేనేజర్ వారి కార్యాలయం నోటిసు బోర్డు నందు కూడా చూడవచ్చు.
ఈ ప్రకటన website www.apsrtc.ap.gov.in నందు కూడా చూడవచ్చు.


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top