ఈ దిగువ తెలుపబడిన ట్రేడ్ లలో ఐ.టి.ఐ పాస్ అయిన అభ్యర్ధులు ఎ.పి. ఎస్.ఆర్.టి.సి లో అప్రెంటిస్ షిప్ కొరకు ఆప్ లైన్ లో తమ యొక్క పేర్లను నమోదు చేసుకోవలసినదిగా కోరుచున్నాము.
ఇందుకోసం అర్హులైన అభ్యర్థులు www.apprenticeshipindia.gov.in యొక్క వెబ్ సైట్ లో తేది 01.08.2023 నుండి తే. 15.08.2023 ది లోపు అప్రెంటిస్ షిప్ (Under NAP Scheme) కోసం వారి పేర్లను రిజిస్టర్ చేసుకొనవలెను.. దరఖాస్తు చేసుకొనుటకు చివరి తేది: 15.08.2023, ఆ తదుపరి తేదీలలో దరఖాస్తు చేసుకున్న వారి అభ్యర్ధులను పరిగణన లోకి తీసుకోనబడవు.
తే.15.08.2023 ది లోగా ఆన్ లైన్ వెబ్ సైట్ అడ్రస్ www.apprenticeshipindia.gov.in నందు దరఖాస్తు చేసుకున్న, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల I.T.I అభ్యర్ధులు వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో (వెరిఫికేషన్ నిమితమై) ఈ క్రింద సూచించిన తేదిలలో, జిల్లాల వారిగా స్వయంగా ఉదయం 10.00 గం.లకు ఆర్.టి.సి, జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ, వి.టి. అగ్రహారం, విజయనగరం నందు హాజరుకావలసి ఉన్నది.
సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కొరకు, ఈ దిగువ తెలుపబడిన ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో (వెరిఫికేషన్ నిమితమై) పాటు ఆయా జిల్లాల కి తెలియచేసిన తేదిలలో హాజరు కావలెను. ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ టైం లో ఒక సెట్ టెరాక్స్ కాపీలను కూడా తీసుకురావలెను.
1. రిజిస్ట్రేషన్ ఫారం, 2. ఎస్.ఎస్.సి. మార్క్స్ లిస్టు, 3. ఐ.టి.ఐ మార్క్స్ లిస్టు, 4. కుల దృవీకరణ పత్రం (SC, ST & BCలు మాత్రమే) మండల కార్యాలయము నుండి పొందిన నివాస దృవీకరణ పత్రము 5. ఎన్.సి.సి/స్పోర్ట్స్, 6. ఆధార్ కార్డు 7. PHC సర్టిఫికేట్ 8. BIO DATA FORM 9. EX-SERVICE MAN ధ్రువపత్రము, 10. సొంత అడ్రస్ గల Rs. 25/- విలువగల స్టాంప్ లు అతికించిన కవరు
తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలు: 18-08-2023
విశాఖపట్నం, అనకాపల్లి, అల్లురి సీత రామ రాజు జిల్లాలు: 19-08-2023
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలు: 21.08.2023
2. ఒక జిల్లాలో సబంధిత ట్రేడ్ నందు ఖాళీలు లేని యెడల, వేరే జిల్లాలలో పని చేయుటకు అంగీకార పత్రమును సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ టైమునందు వ్రాసి ఇవ్వవలెను. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ సమయం లో రూ.118/- (ప్రోసెస్సింగ్ ఫీ నిమిత్తమై (రుసుము 100/- + మరియు GST 18/-) చెల్లించి తగు రశీదు పొంది దరఖాస్తు తో జతపరచి జోనల్ స్టాప్ ట్రైనింగ్ కాలేజీ కార్యాలయంలో అందజేయవలెను. తగు
సహాయం కొరకు మీ జిల్లాకు చెందిన గవర్నమెంట్ ఐ.టి.ఐ అప్రెంటిస్ అడ్వైజర్ వారిని కూడా సంప్రదించ వచ్చును. 3. ఇది వరకే సెలెక్ట్ కాబడి, అప్రన్టిపిఫ్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేయరాదు. అట్టి ధరఖాస్తు లను పరిశీలించబడవు.
ఎవరికైనా ఎటువంటి సందేహములున్న యెడల ఈ క్రింది ఫోన్ నెంబర్ 08922-294906 కి ఈ కార్యాలయం పని చేయు వేళలలో ఫోన్ చేసి సందేహములు నివృత్తి చేసుకొనగలరు.
0 comments:
Post a Comment