కోనసీమలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం... డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ధాన్య సేకరణకు సంబంధించి రెండు నెలల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన కింది సిబ్బంది నియామకానికి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు:
1. టెక్నికల్ అసిస్టెంట్: 331 పోస్టులు
సత్యమేవ జయతే
అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్/ మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ)/ బీఎస్సీ(బీజడ్సీ)/ బీఎస్సీ (లైఫ్ సైన్సెస్)/ డిప్లొమా (అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.
2. డేటా ఎంట్రీ ఆపరేటర్: 331 పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
3. హెల్పర్: 331 పోస్టులు అర్హత: 8, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
మొత్తం పోస్టుల సంఖ్య: 993.
వయోపరిమితి: టీఏ/ డీఈవో పోస్టులకు 21-40 ఏళ్లు; హెల్పర్కు 18-35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు(టీఏ/ డీఈవో పోస్టులకు)
ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత నమూనాలో ఆఫ్లైన్ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, ఎయిమ్స్ కాలేజ్, మొదటి అంతస్తు, ముమ్మిడివరం చిరునామాకు పంపాలి. దరఖాస్తుకు చివరి తేదీ: 08-09-2023.
0 comments:
Post a Comment