AP ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగ నియామకాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్- ఖరీఫ్ 2023-24 సీజన్ వరి సేకరణ సేవలకు సంబంధించి కలెక్టర్ నేతృత్వంలో జిల్లా ఎంపిక కమిటీ ద్వారా రెండు నెలల ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ప్రస్తుతానికి పశ్చిమగోదావరి, బాపట్ల, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో ఉద్యోగ ప్రకటనలు విడుదల కాగా మిగిలిన జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్లు వెలువడాల్సి ఉంది. ఈ ప్రకటన ద్వారా టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఉద్యోగాన్ని బట్టి పదోతరగతి, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు (టీఏ/ డీఈవో పోస్టులకు) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. టీఏ/ డీఈవో పోస్టులకు 21-40 ఏళ్లు; హెల్పర్కు 18-35 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను ఆయా జిల్లా కేంద్రాల్లోని ఏపీఎస్సీఎస్సీఎల్ కార్యాలయాలకు పంపాల్సి ఉంటుంది.
 
 Subscribe My Whatsapp & Telegram Groups
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment