SSC CPO Notification 2023 : కేంద్ర సాయుధ దళాలైన బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఎస్‌బీ, సీఐఎస్‌ఎఫ్‌లతోపాటు ఢిల్లీ పోలీస్ విభాగంలో 1876 సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ విద్యార్హతతో ఈ పోస్టులకు పోటీ పడొచ్చు. ఆన్‌లైన్ పరీక్ష, పీఎస్‌టీ, పీఈటీ వైద్య పరీక్షలతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. శిక్షణ అనంతరం విధుల్లో చేరిన మొదటి నెల నుంచే రూ.60 వేల జీతం అందుకోవచ్చు. వివరాల్లోకెళ్తే
ముఖ్య సమాచారం:
ఖాళీలు : 1876. వీటిలో సీఏపీఎఫ్‌ల్లో 1714 ఉన్నాయి. (సీఆర్‌పీఎఫ్ 818, బీఎస్‌ఎఫ్ 113, ఐటీబీపీ 63, సీఐఎస్‌ఎఫ్ 630, ఎస్‌ఎస్‌బీ 90. దిల్లీ పోలీస్.. పురుషులకు 109, మహిళలకు 53).
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వాళ్లు అర్హులు.
వయసు: ఆగస్టు 1, 2023 నాటికి 25 ఏళ్లలోపు ఉండాలి. ఆగస్టు 2, 1998 ఆగస్టు 1, 2003 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో మినహాయింపు ఉంది.
శారీరక ప్రమాణాలు: పురుషులు 170, మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎస్టీలైతే పురుషులు 162.5, మహిళలు 154 సెం.మీ. చాలు. ఊపిరి పీల్చిన తర్వాత కనీసం 85 సెం.మీ, పీల్చక ముందు 80 సెం.మీ. ఛాతీ విస్తీర్ణం పురుషులకు ఉండాలి
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:ఆగస్టు 15, 2023
పరీక్ష ఫీజు: రూ.100, మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు మినహాయించారు.
కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు: అక్టోబరులో నిర్వహిస్తారు.
పరీక్ష కేంద్రాలు: ఏపీ.. గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం. తెలంగాణ.. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:https://ssc.nic.in/
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment