TCS NQT 2023 Notification

TCS NQT 2023 August Exam Registration : ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) నేషనల్‌ క్వాలిఫైయర్‌ టెస్ట్‌ 2023.. ఆగస్టు సెషన్‌ నోటిఫికేషన్ విడుదలైంది. TCS NQT 2023 లో అర్హత సాధించిన వారికి దేశవ్యాప్తంగా ఉన్న టీసీఎస్‌ సంస్థలతో పాటు మరో 2400 సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. TCS NQT 2023 పరీక్షకు ఇంజినీరింగ్‌, ఆర్ట్స్, కామర్స్‌, సైన్స్‌ గ్రాడ్యయేట్స్‌ అప్లయ్‌ చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో జులై 31, 2023 వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు. ఆగస్టు 12, 2023 తేదీ నుంచి దేశవ్యాప్తంగా TCS NQT 2023 పరీక్షను నిర్వహించనున్నారు. వివరాల్లోకెళ్తే..
TCS National Qualifier Test 2023 - August session

అర్హత: ఇంజినీరింగ్‌, పీజీ పాసైన అభ్యర్థులు అర్హులు.

ఎంపిక విధానం: నేషనల్‌ క్వాలిఫైయర్‌ టెస్ట్‌ (NQT) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దీన్ని ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పద్ధతిలో నిర్వహిస్తారు. ఈ స్కోరుకు 2 సంవత్సరాల వరకు వాలిడిటీ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: జులై 31, 2023

TCS NQT 2023 పరీక్ష తేది: ఆగస్టు 12, 2023

TCS NQT 2023 పరీక్షా విధానం:

TCS NQT పరీక్షలో మొత్తం 92 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 180 నిమిషాలు ఉంటుంది. ఇందులో 5 విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. పూర్తి వివరాల్లోకెళ్తే..
వర్బల్‌ ఎబిలిటీ : 24 ప్రశ్నలు - 30 నిమిషాలు
రీజనింగ్‌ ఎబిలిటీ: 30 ప్రశ్నలు - 50 నిమిషాలు
న్యూమరికల్‌ ఎబిలిటీ : 26 ప్రశ్నలు - 40 నిమిషాలు
ప్రోగ్రామింగ్‌ లాజిక్ : 10 ప్రశ్నలు - 15 నిమిషాలు
కోడింగ్‌ - 02 ప్రశ్నలు : 45 నిమిషాలు


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top