SSC CAPF GD Constable 2022 Admit Card : ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ (SSC CAPF GD Constable) పోస్టుల భర్తీకి సంబంధించి.. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఈ-ఈఅడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ మేరకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) ఆధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ-అడ్మిట్ కార్డులు ఉంటేనే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు అనుమతి ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో జులై 17 నుంచి అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక.. ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ (SSC CAPF GD Constable) పీఈటీ/ పీఎస్‌టీ ఫలితాలు జులై 30వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. ఫిజికల్ ఫిట్‌నెట్ టెస్ట్‌లకు మొత్తం 3.70 లక్షల మంది అభ్యర్థులు ఎంపిక కాగా.. 1.46 లక్షల మంది వైద్య పరీక్షలకు అర్హత సాధించారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులు భర్తీ చేస్తున్న విషయం కూడా విధితమే.ఈ ఏడాది (2023) జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎస్‌ఎస్‌సీ ఓపెన్ కాంపిటీటివ్ పరీక్షను నిర్వహించింది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులను మే 1 నుంచి 6 తేదీల్లో నిర్వహించింది. వైద్య పరీక్షలు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం రిజర్వేషన్లు బట్టి వివిధ సాయుధ బలగాల్లో ఈ అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికవుతారు.
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment