గోరఖ్‌పూర్‌లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్త్ ఈస్ట్రన్ రైల్వే ఎన్‌ఈఆర్ పరిధిలోని వివిధ యూనిట్లలో అప్రెంటిస్‌షిప్ శిక్షణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1104 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 02 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్రెంటిస్ పోస్టులు
మొత్తం ఖాళీలు: 1104
వర్క్‌షాప్/ యూనిట్‌ల వారీగా స్లాట్‌లు..
➥ మెకానికల్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్): 411
➥ సిగ్నల్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్ కంటోన్మెంట్): 63
➥ బ్రిడ్జ్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్ కంటోన్మెంట్): 35
➥ మెకానికల్ వర్క్‌షాప్ (ఇజ్జత్‌నగర్): 151
➥ డీజిల్ షెడ్ (ఇజ్జత్‌నగర్): 60
➥ క్యారేజ్ అండ్ వ్యాగన్ (ఇజ్జత్‌నగర్): 64
➥ క్యారేజ్ అండ్ వ్యాగన్ (లఖ్‌నవూ జంక్షన్): 155
➥ డీజిల్ షెడ్ (గోండా): 90
➥ క్యారేజ్ అండ్ వ్యాగన్ (వారణాసి): 75
ట్రేడ్: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, మెకానిక్ డీజిల్, ట్రిమ్మర్.
అర్హత: 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 02.08.2023 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 02.08.2023.
Job Notification Whatsapp Group:
Job Notification Telegram Group:
0 comments:
Post a Comment